Friday, November 30, 2007

The Pursuit of happiness & మహారాజు




ఉపోద్ఘాతం:
అప్పుడెప్పుడో ఒక ఫ్రెండ్ మాట్లాడుతూ - ఈ సినిమా చూసేటప్పుడు - literally I cried yaar అన్నాడు. వార్నీ వీడికి ఇంత కళా పొషణ వుందా అనిపించి - అయినా వీణ్ణి కూడా ఏడ్పించిందంటే ఏమి వుంటుందా అనుకుంటూ నెక్స్ట్ డే ఈ సినిమా చూసాను. ఈ సినిమా చూస్తున్నపుడు - నాకు తెలియకుండానే 'మహారాజు ' అనే తెలుగు సినిమా తెగ గుర్తుకు వచ్చింది. సినిమా అయిపోయే సమయానికి ఒక చాలా మంచి సినిమా చూసామన్న తృప్తి కలుగుతుంది.

కథ:
క్రిస్ గార్డ్నెర్ అనే ఒక సేల్స్-మేన్ తన లైఫ్ లో చాలా ఢక్కామొక్కీలు తిని,కష్టాలు అనుభవించి - చివర్లో ఒక పెద్ద కంపెనీ పెట్టే స్థాయి కి ఎదుగుతాడు - ఒక్క ముక్క లో ఇదీ కథ. ఒక వ్యక్తి నిజ జీవిత గాథ ఆధారంగా దీన్ని తీసారట. క్రిస్ గార్డ్నెర్ సేల్స్ మేన్ గా పని చేస్తూ - తనకి వచ్చే చాలీ చాలని జీవితం తో లైఫ్ గడుపుతూ, తన కొడుకు, భార్య కి ఇంకా మంచి లైఫ్ ఇవ్వడానికి తను ఇంకా సంపాదించడానికి తపన పడుతూంటాదు. అయితే భార్య ఇతన్ని వదిలేసి వెళ్ళడం, కొడుకు ని తనే పెంచటం, ఈ మధ్యలో ఒక స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్ లో ఇంటర్న్-షిప్ జాయిన్ అయ్యి జీతం లేకుండా 6 నెలలు పనిచేయడం, ఆ టైం లో ఆర్థిక ఇబ్బందులు మరీ ఎక్కువయిపొవడం ,అద్దె ఇవ్వట్లేదని వీళ్ళ ఇంటి ఓనర్ ఇంట్లో నుంచి వీళ్ళని బయటకి పంపేయడం, - ఒక పాయింట్ ఆఫ్ టైం లో రక్తం అమ్ముకుని రోజు గడపడం లాంటి చాలా సంఘటన లతో సాగుతుంది కథ.

ఇంకా..

అయితే, సినిమా లో మనల ని కట్టిపడేసే అంశాలు చాలా చాలా వున్నాయి. మొదటిది- ఎన్ని కష్టాలు వచ్చినా తన యాటిట్యూడ్ ని, తన ఆత్మ విశ్వాసాన్ని, తన ఫోకస్ ని సడలించకుండా క్రిస్ ముందుకెళ్ళడం చాలా ఇన్ స్పైరింగ్ గా వుంటుంది.రెండోది విల్ స్మిత్ పర్ఫార్మెన్స్. 6 నెలలు అప్రెంటిస్ చేసిన తర్వాత తన ఉద్యోగం కంఫర్మ్ అయినపుడు విల్ స్మిత్ యాక్షన్ కదిలించేస్తుంది. అప్పుడు ఆఫీస్ లోంచి బయటికి వచ్చాక - 'This is HAPPINESS ' అనే డైలాగు కూడా.

మహారాజు :

అయితే పైన ప్రస్తావించిన 'మహారాజు ' సినిమా కి దీనికి కథాపరంగా ఎలాంటి పోలికలు లేవు. అందులో శొభన్ బాబు హీరో. విజయబాపినీడు డైరెక్షన్. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే, తన తమ్ముళ్ళని, చెల్లెలి ని చదివించడానికి తను పనికి వెళతాడు. తన జీవితమంతా వాళ్ళ గురించే గడుపుతాడు. పెళ్ళి కూడా - డబ్బు అవసరమయితే, పెళ్ళి చేసుకుంటే వచ్చే కట్నం తమ్ముడి చదువు కి పనికి వస్తుంది అని అమ్మాయిని కూడా చూడకుండా పెళ్ళి చేసుకుంటాడు. అయితే ఆ అమ్మాయి ఆ డబ్బు ఇవ్వలేకపోయినా ఆమె ని బాగా చూసుకుంటాడు. తమ్ముళ్ళు, చెల్లెలు ఏమో లైఫ్ లో బాగ సెటిల్ అయ్యాక అన్న ని ఛీత్కరించుకుంటారు. ఇంతలో ఒక ప్రెస్ లో ప్రూఫ్ రీడర్ గా చేరడం, కాస్త పుస్తకాలు చదివాక తనకీ రాయాలనిపించడం, తన భార్య ప్రోత్సాహం తో ఆ పుస్తకాన్ని పూర్తి చేయడం జరుగుతాయి. అయితే ఆ పుస్తకం అచ్చు అయి తనకి పేరు, డబ్బు వచ్చే సమయానికి ఒక ప్రమాదం లో భార్య చనిపోతుంది. డబ్బు వచ్చే సరికి దూరమైన తమ్ముళ్ళు చెల్లెలు అందరూ దగ్గరికి వస్తారు - కానీ అతని కష్టాలన్నిటి ని పంచుకున్న భార్య మాత్రం ఆ కష్టానికి వచ్చిన ప్రతిఫలాన్ని అనుభవించకుండగానే చనిపోతుంది.
చాలా సంవత్సరాల కింద చూసా ఈ సినిమా ని. ఒక పాట వుంటుంది -
".......
.......
మనసంటూ లేనోళ్ళే నిరుపేదలు,
మనసున్న మంచోళ్ళే మహరాజులు,
రాజువయ్యా మహరాజువయ్యా.. "

అని. నాకు బాగ ఇష్టం ఆ పాట. దీని డయలర్ టోన్ దొరుకుతుందేమోనని కూడా ట్రై చేసా ఒక సారి. ఐడియా వాడు తూచ్ అన్నాడు (:-

Monday, October 15, 2007

Chirutha- Telugu movie




Probably- this was the most awaited movie in telugu film industry this year. This is not review of the movie, but just an opinion.

One enters this movie with high spirit because- it is first movie of Chiranjeevi's son. It is directed by current number one director Puri jagannath, produced by top telugu producer, all the top technicians worked for this movie. But with the first scene itself the tempo goes down beyond the expected level. Within one scene one could predict that storywise there wont be much in this movie. film appears to be routine in first few scenes. It is only after entry of the hero tempo picks up. Hero's dancing skills, agility in fights is extraordinary, which is sufficient to cheer up fans.

On the whole, movie is made just to showcase Ramcharan's skills but not to give a great entertaining story. I think the only possible opportunity to break the Kaho Na pyar hain sensation has been wasted. This film got tremendous openings. Had there been a story which entertain normal audience other than fans, the movie mght have done wonders.

Thursday, September 13, 2007

zuran

There is a small flashback behind this- some friends calling me by name - zuran , instead of my actual name. Anyway that may not be relevant to this blog.
This blog - i would like to dedicate only for movies - mostly abt telugu movies. Let me come with more updates soon. Until then ...